కరీంనగర్ జిల్లా సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లో పరిశ్రమలకు కరెంటు సరఫరాను గురువారం పునరుద్ధరించారు.
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లో పరిశ్రమలకు కరెంటు సరఫరాను గురువారం పునరుద్ధరించారు. విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) అధికారులు బుధవారం పార్క్‌లోని ఇరవై పరిశ్రమల విద్యుత్ కనెక్షన్లను తొలగిం చారు.
దీనిపై ‘టెక్స్‌టైల్ పార్క్‌లో పరిశ్రమలకు పవర్‌కట్’ శీర్షికతో ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో గురువారం ప్రచురితమైన కథనానికి సెస్ పర్సన్ ఇన్‌చార్జ్ దోర్నాల లక్ష్మారెడ్డి స్పందించి విద్యుత్ పునరుద్ధరణకు ఆదేశించారు. ఈ మేరకు కరెం టును పునరుద్ధరించడంతో యజమా నులు వస్త్రోత్పత్తిని ప్రారంభించారు.
టెక్స్‌టైల్ పార్క్‌కు విద్యుత్ రాయితీ అంశంపై ఫిబ్రవరి 5వ తేదీలోగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉం దని లక్ష్మారెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ హామీ మేరకే పార్క్‌లోని పారిశ్రామికవేత్తలు సమ్మె విరమించారని, ఈలోగా బకాయిల పేరిట కరెంట్ తొలగించడం సరికాదనే ఉద్దేశంతోనే తొలగించిన కనెక్షన్లను పునరుద్ధరించినట్లు ఆయన వివరించారు.