
టీబీజేపీ పటిష్టానికి ‘షా’ వ్యూహం
తెలంగాణలో కమల వికాసానికి కొత్త అధ్యక్షుడు అమిత్ షా సారథ్యంలో బీజేపీ సరికొత్త వ్యూహరచన చేస్తోంది. టీఆర్‌ఎస్ సర్కార్ వైఖరిని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లడం,
టీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడం
ప్రతి ఇంటికి పార్టీ చేరేలా ఏర్పాట్లు
21, 22న నగరంలో అమిత్‌షా
స్టోరీ బోర్డు
హైదరాబాద్: తెలంగాణలో కమల వికాసానికి కొత్త అధ్యక్షుడు అమిత్ షా సారథ్యంలో బీజేపీ సరికొత్త వ్యూహరచన చేస్తోంది. టీఆర్‌ఎస్ సర్కార్ వైఖరిని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లడం, సామాజిక అంశాలను ఎజెం డాగా చేసుకుని పార్టీని గ్రామగ్రామానికి తీసుకెళ్లడం అనే రెండింటిని ప్రధాన ఆయుధాలుగా చేసుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 21, 22 తేదీల్లో అమిత్‌షా హైదరాబాద్‌లో మకాం వేసి పార్టీ శాఖకు ఈమేరకు దిశానిర్దేశం చేయబోతున్నారు. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ముమ్మర ప్రచారం చేసి పార్టీని అధికారంలోకి తెచ్చిన ప్రధాని నరేంద్రమోడీ తొలి సభను హైదరాబాద్‌లోనే నిర్వహిం చి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు పార్టీ జాతీయాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్‌షా కూడా రాష్ట్రాల సమీక్షలను హైదరాబాద్‌తోనే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
ఇక కేసీఆర్ సర్కార్‌తో ఢీ అంటే ఢీ...
గత ఎన్నికల్లో మోడీ హవాతో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని ఉబలాటపడ్డ బీజేపీకి తెలంగాణలో తీవ్రనిరాశే మిగిలింది. కనీసం పదిహేనుకు తగ్గకుండా ఎమ్మెల్యే సీట్లు పొందాలనుకున్నా... టీఆర్‌ఎస్ హవా ముందు నిలువలేక ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. ఎంపీ స్థానం ఒక్కటి మాత్రమే గెలుచుకుంది. ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడడం ద్వారా ఇతర ప్రతిపక్షాలకన్నా ముందంజలో ఉండాలనీ, తద్వారా బలాన్ని విస్తరించుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీంతో కొన్నిరోజులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సహా ఇతర సీనియర్ నేతలు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రెండురోజుల క్రితం ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ మండలి సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర నేతలకు పార్టీ అధినాయకత్వం కొన్ని సూచనలు చేసింది. ప్రతి ఊరిలో పార్టీ జెండా ఎగిరేలా చూడాలని సూచిం చారు. కేసీఆర్ అనుసరించే విధానాలు, అభివృద్ధి పనుల్లో జాప్యం, హామీలను నెరవేర్చడంలో దాటవేత ధోరణి తదితర అంశాలపై ఉద్యమించాలని స్పష్టం చేసింది.
సామాజిక అంశాలే ప్రధానాస్త్రాలుగా...
ప్రజలకు-పార్టీకి మధ్య చక్కటి బంధం ఏర్పడాలంటే సామాజిక అంశాలపై ఉద్యమించాలని మోడీ, అమిత్‌షా సూచించారు. నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణ, గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, సేంద్రీయ ఎరువుల వాడ కం, పారిశుధ్యం అంశాలను ఎంచుకుని కార్యకర్తలు ఇంటిం టికీ వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సూచిం చారు. అమిత్‌షా రెండు రోజులపాటు హైదరాబాద్‌లో మకాం వేసి పార్టీ రాష్ట్రశాఖ నుంచి గ్రామ శాఖల వరకు అధ్యక్షులతో చర్చించబోతున్నారు. తొలిరోజు పార్టీ నగరశాఖ, ఆఫీసుబేరర్లతో భేటీలు, రెండోరోజు గ్రామశాఖలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి జి ల్లా నేతలతో సమావేశాలు ఆరంభమయ్యాయి.