ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం రాత్రి ఇరు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం రాత్రి ఇరు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ బంద్ పిలుపు వివాదానికి కారణమైందని పోలీసులు, విద్యార్థుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. బంద్‌లో భాగంగా ఏబీవీపీ కార్యకర్తలు ఉదయం వర్సిటీలోని లైబ్రరీని మూయించడానికి వెళ్లారు.
అక్కడ చదువుకుంటున్న రవి అనే పీజీ విద్యార్థి బంద్‌ను వ్యతిరేకించడంతో అతన్ని కొట్టారు. రవి సహచరులు కొన్ని విద్యార్థి సంఘాల కార్యకర్తలతో కలిసి రాత్రి 11.30 తర్వాత క్యాంపస్‌లోని న్యూ పీజీ, ఓల్డ్ పీజీ హాస్టళ్లలో ఏబీవీపీ నాయకుల గదులపై దాడి చేశారు. ఇరువర్గాలూ కర్రలతో దాడులు చేసుకున్నారు. పోలీసులొచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.