‘తెలంగాణ సారస్వత పరిషత్తుకు పెద్ద చరిత్ర’

Telangana Saraswatha Parishath celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సారస్వత పరిషత్తు 75 పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పంచ సప్తతి మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సారస్వత పరిషత్తుకు పెద్ద చరిత్ర ఉందని, ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తెలుగు భాష పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆధునికత పేరుతో ఆంగ్ల భాషపై వ్యామోహం పెరిగిందని.. ఇంగ్లీష్‌ వస్తేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనే భావన ప్రజల్లో ఉందని అన్నారు. ఈ సందర్భంగా సారస్వత పరిషత్తు ప్రచురించిన పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.

విశిష్ట అతిథిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, గౌరవ అతిథులుగా డాక్టర్‌ కేవీ రమణాచారి, డాక్టర్‌ ముదిగంటి సుజాతా రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమ అనంతరం రాష్ట్రస్థాయి కవి సమ్మేళనాలన్ని నిర్వహించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top