అభ్యర్థులెవరో తేలేది.. దీపావళి తర్వాతే

Telangana BJP MLA Candidates List Released Rangareddy - Sakshi

బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో జిల్లాలోని ఆశావహులకు బెర్తు లభించలేదు. గత నెలలో మొదటి జాబితా ప్రకటించిన కాషాయ పార్టీ శుక్రవారం సెకండ్‌ లిస్ట్‌ విడుదల చేసింది. మొదటి జాబితాలో తాండూరు నియోజకవర్గం నుంచి పటేల్‌ రవిశంకర్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. మిగిలిన వికారాబాద్, పరిగి, కొడంగల్‌ స్థానాల్లో పోటీచేసే వారిని ఖరారు చేయలేదు. దీంతో రెండో జాబితాలో తమ పేర్లు ఉంటాయనుకున్న ఆశావహులకు నిరాశే ఎదురైంది. పోలింగ్‌కు కేవలం 34 రోజుల సమయమే ఉండటంతో సాధ్యమైనంత త్వరగా ప్రచారం ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటికీ లిస్ట్‌లో తమ పేర్లు లేకపోవడంతో నిట్టూర్చారు. రాష్ట్రం నుంచి పోటీచేసే అభ్యర్థుల మూడో, చివరి జాబితాను దీపావళి తర్వాత ప్రకటిస్తామని కేంద్ర మాజీ 
మంత్రి దత్తాత్రేయ ప్రకటించడంతో మరో నాలుగైదు రోజులు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది.

సాక్షి, వికారాబాద్‌: తెలంగాణలో ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ఆలస్యమైనా సరే గెలిచే అభ్యర్థులను వెతకాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతోందని సమాచారం. జిల్లాలోని పరిగి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు విషయంలో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ.. రెండో జాబితాలో ఈయన పేరు సైతం కనిపించలేదు. దీంతో ఇక్కడ మరో అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషిస్తోందనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రహ్లాద్‌రావు సొంత నియోజకవర్గం పరిగి అయినప్పటికీ.. కేవలం తన సొంత మండలమైన కుల్కచర్లకు మాత్రమే పరిమితమై కార్యక్రమాలు నిర్వహిస్తుంటారనే అసంతృప్తి ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రహ్లాద్‌రావుకు టికెట్‌ ఇస్తే మిగతా మండలాల సంగతేమిటని అధిష్టానం ప్రశ్నించినట్లు సమాచారం.

దీనికి తోడు ఈయనకు పోటీగా మరికొంతమంది నాయకులు పావులు కదుపుతుండటంతోనే అభ్యర్థి ప్రకటన ఆగిపోయిందని తెలుస్తోంది. వికారాబాద్‌ టికెట్‌ ఆశిస్తున్న వారిలోనూ ఎవరికీ గెలిచే సీన్‌ లేకపోవడంతోనే అభ్యర్థి ఎంపికను పెండింగ్‌లో ఉంచినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నిర్వహించిన సర్వేలో  ప్రజలు ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలే దని సమాచారం. దీంతో ఇక్కడ కూడా మరో అభ్యర్థిని వెదికే పనిలో ఉన్నట్లు వినికిడి. ఇక కొ డంగల్‌లో  నుంచి పోటీకి స్థానికులెవరూ ముందు కు రాకపోవడంతో ఆస్థానాన్ని కూడా అధిష్టానం పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఇక్కడ స్థానికేతరులైన నారాయణపేటకు చెందిన నా గూరావు నామోజీ, హైదరాబాద్‌కు చెందిన పార్టీ కోశాధికా రి శాంతకుమార్‌ పేర్లు ప్రచారంలో ఉ న్నా రెండో జాబితాలో వీరికి కూడా స్థానం లభించలేదు.

ఆలస్యమైతే దుష్ఫలితాలు.. 
జిల్లాలో బలమైన పార్టీలుగా ఉన్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను ఢీకొనాలంటే సాధ్యమైనంత త్వర గా అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ నాయ కులు, కార్యకర్తలు కోరుతున్నారు. ఇప్పటికే మూ డు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ రెండు నెలలుగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్‌ పా ర్టీ నుంచి పరిగి, కొడంగల్‌లో టికెట్లు దాదాపు తా జా మాజీలకే ఖరారు కావడంతో వీరు సైతం ప్రత్యక్ష, పరోక్ష విధానాల్లో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీచేసే అభ్యర్థులంతా కొత్తవారు కావడంతో వెంటనే పేర్లు ప్రకటించాలని కాషాయదళం కోరుతోంది. ఈ విషయంపై మరింత జా ప్యం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కార్యకర్తలు పేర్కొంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top