‘అలా చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెడలో దండ’ | tammineni veerabhadram talks against TS govt | Sakshi
Sakshi News home page

‘అలా చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెడలో దండ’

Mar 6 2017 7:57 PM | Updated on Oct 16 2018 8:46 PM

‘అలా చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెడలో దండ’ - Sakshi

‘అలా చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెడలో దండ’

సామాజిక న్యాయం పాటిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెడలో దండవేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

పెద్దఅడిశర్లపల్లి: కులాల వారీగా బడ్జెట్‌ కేటాయించి సామాజిక న్యాయం పాటిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెడలో దండవేస్తామని..లేదంటే ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలో సాగింది.

ఈ సందర్భంగా రంగారెడ్డిగూడెం, అంగడిపేట ఎక్స్‌ రోడ్డు వద్ద నిర్వహించిన సభల్లో తమ్మినేని మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్‌ కేటాయింపుల్లో సమన్యాయం పాటించాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం కట్టిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌ తాను మాత్రం రూ.50 కోట్ల ప్రజాధనంతో భవనం నిర్మించుకున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement