
నరేశ్ హత్యపై సీఎం కేసీఆర్ స్పందించాలి: తమ్మినేని
రాష్ట్రంలో కుల దురంహకార హత్యలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.
నరేశ్ హత్యకేసు విషయంలో పోలీసులపై కేసులు నమోదు చేయాలని టఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. సభలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాస్‌రాం నాయక్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, నరేశ్ తల్లిదండ్రులు వెంకటయ్య, ఇందిరమ్మ, ప్రజా సంఘాల వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.