'ఏపీలోనూ బాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు' | talasani srinivas criticises chandra babu on AP MLC elections | Sakshi
Sakshi News home page

'ఏపీలోనూ బాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు'

Jun 23 2015 4:33 PM | Updated on Mar 23 2019 9:03 PM

'ఏపీలోనూ బాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు' - Sakshi

'ఏపీలోనూ బాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్ విమర్శించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్ విమర్శించారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయి రెండు రాష్ట్రాల ప్రజల సమస్యగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఓటుకు కోట్లు కేసులో ఇంత జరిగిన తర్వాత కూడా ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇతర పార్టీల నేతలను నెల్లూరులో దాచిపెట్టారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ఎటువంటి ఢోకా లేదని మంత్రి చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలలో చేస్తున్న రాజకీయాలు చూసి ప్రజలే ఆయనను అసహ్యించుకుంటున్నారని మంత్రి తలసాని యాదవ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement