
'హైదరాబాద్ లో దుర్భరమైన పరిస్థితులు'
నగరంలో ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులున్నాయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్:నగరంలోని ప్రజలకు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ను ఇలానే వదిలేస్తే మరింత ఘోరంగా తయారయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఈ నగరాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని అవసరం ఉందన్నారు. హుస్సేన్ సాగర్ లోకి వచ్చే అన్ని మురికి కాల్వలను దారి మళ్లిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
రాజధాని పరిధిలోని అన్ని మురికి వాడల్లో రెండు, మూడు అంతస్థుల భవన నిర్మాణాలు చేసి పేదాలకు ఇస్తామన్నారు. హెరిటేజ్ వారసత్వ భవనాల విషయంలో ఆచరణ సాధ్యమైన పద్ధతిని అవలంభిస్తామని కేసీఆర్ తెలిపారు.