సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్

సాక్షి, కొత్తగూడెం : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా ల్లోని 6.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఆదివారం ఆమె భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం, పాల్వంచ, ములకలపల్లి మండలాల్లో జరుగుతున్న ప్రాజెక్టు కెనాల్, పంప్‌హౌస్ పనులను పరిశీలించారు.
నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులు, కాం ట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జూన్ 2020 నాటికి సాగునీరు అందించేలా పనులు చేయాలన్నారు. మొదటి ప్యాకేజీలో భాగంగా చేస్తున్న పంప్‌హౌస్, కెనాల్ పనులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే జనవరిలోగా పంప్‌హౌస్ డ్రైరన్ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆనకట్ట నుంచి బీజీకొత్తూరు వరకు కెనాల్ పనులు, పంప్‌హౌస్, వంతెనలు జన వరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ 2 నెలలు యుద్ధ్దప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి