
నేపాల్ నుంచి తీసుకురావాలి
ఉపాధి కోసం మండలంలోని గర్రెపల్లి నుంచి నేపాల్ వెళ్లిన వందమందిని ప్రత్యేక విమానంలో తొలుత ఢిల్లీకి చేర్చాలని విదేశాంగ ప్రతినిధి శశాంక్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ ఫోన్ ద్వారా విన్నవించారు.
మంత్రి కేటీఆర్‌కు విన్నవించిన గర్రెపల్లి సర్పంచ్
సుల్తానాబాద్ : ఉపాధి కోసం మండలంలోని గర్రెపల్లి నుంచి నేపాల్ వెళ్లిన వందమందిని ప్రత్యేక విమానంలో తొలుత ఢిల్లీకి చేర్చాలని విదేశాంగ ప్రతినిధి శశాంక్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ ఫోన్ ద్వారా విన్నవించారు. గర్రెపల్లి సర్పంచ్ పడాల అజయ్‌గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సూర శ్యామ్, టీఆర్‌ఎస్ నాయకులు బాలాజీరావు, ప్రశాంత్‌రావు, నల్ల మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్ డెరైక్టర్ కల్లెపల్లి జా నీ మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీని కలిసి తమ గ్రామస్తులను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకురావాలన్నారు.
తొలివిడతలో వంద మందిని ఢిల్లీ.. అక్కడ్నుంచి స్వగ్రామాలకు పంపిస్తారని, ఎవరూ అధైరపడొద్దని కేటీఆర్‌ఎస్ చెప్పారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం అందిందన్నారు.