సెబాస్టియన్..ఓ కబ్జా కోరు | sebasteon occupied my home says philips | Sakshi
Sakshi News home page

సెబాస్టియన్..ఓ కబ్జా కోరు

Jun 10 2015 9:45 AM | Updated on Sep 3 2017 3:31 AM

సెబాస్టియన్..ఓ కబ్జా కోరు

సెబాస్టియన్..ఓ కబ్జా కోరు

ఓటుకు నోటు కేసులో నిందుతుడిగా ఉన్న సెబాస్టియన్కి సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందుతుడిగా ఉన్న సెబాస్టియన్ హారీకి సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అద్దెకి దిగిన ఇంటినే కబ్జా చేయాలని చూస్తున్నాడని యజమాని ఫిలిప్స్ అవేదన వ్యక్తం చేశారు. 2003 లో సెబాస్టియన తన భార్య పేరు మీద ఎర్రగడ్డలోని తమ ఇంట్లో అద్దెకి దిగాడని చెప్పారు. 2008 లో తమకే ఇళ్లు అవసరం ఉందని ఖాళీ చేయాల్సిందిగా కోరగా, వాళ్ల బాబుకు పరీక్షలు ఉన్నాయని చెప్పి.. ఆ తర్వాత ఖాళీ చేయడానికి నిరాకరించారని చెప్పారు.
దీంతో కోర్టును కూడా ఆశ్రయించగా, తన సంతకం ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించి స్టే తీసుకొచ్చారని పిలిప్స్ ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించలేదని, మానసింగా ఇబ్బందిపెడుతున్నాడని చెప్పారు.

ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ఇళ్లలో హై రెసొల్యూషన్ తో అమర్చిన సీసీ కెమెరాలు విచారణలో కీలకంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి పూర్తి ఫూటేజిని ఏసీబీ అధికారులు సేకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement