కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం

The Role Of Court Constables Is Crucial - Sakshi

సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌

ఖమ్మంక్రైం : పోలీస్‌ శాఖలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర చాలా కీలకమైందని సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ అన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని కోర్టు కానిస్టేబుళ్లకు ఒకరోజు కోర్టు మానిటర్‌ సిస్టం శిక్షణ శిబిరం సిటీ పోలీస్‌శిక్షణ కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ నేరాలకు పాల్పడిన నిందుతులకు శిక్ష పడినప్పుడే నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు.

కేవలం సాక్షులను సకాలంలో న్యా యస్థానంలో హాజరు పరుస్తూ కోర్టు కానిస్టేబుళ్లు తీసుకోవాల్సిన చొరవే అతి ముఖ్యమైనదని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కోర్టు కానిస్టేబుళ్లకు ఐపాడ్‌ ట్యాప్స్‌ ఇచ్చామని, వాటిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. నేరస్తులకు వారెంట్లు, సమన్లు సత్వరమే అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కాని స్టేబుళ్లకు సూచించారు. 

కోర్టు సమాచారం ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు తెలియపర్చాలని సూచించారు. కోర్టు క్యాలెండర్‌ ఎప్పటికప్పుడు పొందు పర్చడం చేయాలని, కేసు ట్రయల్స్‌ సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సలహాలు, సూచనలు స్వీకరించాలని కోర్టు కానిస్టేబుళ్లను సీపీ ఆదేశించారు. కోర్టు పెండింగ్‌ ట్రయల్‌ కేసులు, వారెంట్లు, సమన్లు, సీసీటీఎస్‌ఎస్‌లో సీఎంఎస్‌ (కోర్టు మానిటర్‌ సిస్టమ్‌)లో డేటా ఎంటర్‌ చేయాలని సూచించారు.

ఈ డేటాను టీఎస్‌ కాప్‌కు అనుసంధానం చేస్తామని వివరిం చారు. దీని ద్వారా ప్రతిరోజు కోర్టులో ప్రక్రియ ఎలా ఉంటుందనేది ఆన్‌లైన్‌లో వెంటనే తెలుస్తుందని, కోర్టు కానిస్టేబుళ్ల పని సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజు కోర్టులో ట్రయ ల్‌ జరిగిన కేసులు ఎంటర్‌ చేసినట్లయితే పెండింగ్‌ లేకుండా ఉంటుందని పేర్కొన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతూ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ మరింత పరిజ్ఞానంతో పోలీసుల పని సులభరతం చేస్తున్నామన్నారు. కోర్టు విధుల్లో చక్కని ప్రతిభ కనబర్చిన కేసుల్లో శిక్షలు పడేవిధంగా పనిచేసే సిబ్బందికి ప్రతినెల రివార్డులు అందజేస్తామని, ఇప్పటివరకు గత నెలలో జైలు శిక్షపడిన కేసుల్లో కోర్టు సిబ్బంది ఆరుగురికి రివా ర్డు ఇచ్చామని సీపీ తెలిపారు.

కాగా, ఐటీ కోర్‌ సిబ్బంది కోర్టు మానిటర్‌ సిస్టం గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చినవారిలో ఎం.వెంకయ్య (ఎన్కూర్‌ పీఎస్‌), ఎం.భార్గవ్‌ (ముదిగొండ), శ్రీనివాసరెడ్డి(ఖమ్మం అర్బన్‌), ఆర్‌.నాగేశ్వరరావు (ఖమ్మం త్రీటౌన్‌), ప్రభాకర్‌ ఏఎస్‌ఐ ఉన్నారు.

కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ సురేశ్‌కుమార్, ఖమ్మం ఏసీపీ వెంకట్రావు, సీసీఆర్‌బీ ఏసీపీ రామానుజం, డిప్యూటీ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ రామారావు, సీఐలు శివసాంబిరెడ్డి, సురేశ్, ఎస్‌ఐ జానీపాషా, ఆర్‌ఎస్‌ఐ మీరా తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top