చర్లపల్లి సెంట్రల్ జైల్‌లో మరో ఖైదీ ఆత్యహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైల్‌లో మరో ఖైదీ ఆత్యహత్యకు పాల్పడ్డాడు. జీవిత శిక్ష అనుభవిస్తున్న శేఖర్ అనే ఖైదీ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. శేఖర్ యాసిడ్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన తోటి ఖైదీలు జైలు అధికారులు తెలిపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
అయితే సోమవారం ఉదయం జైల్లో ఖైదీలు ఆందోళనకు దిగారు. తరచూ అధికారులు తమను వేధిస్తున్నారని ఖైదీలు ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఈరోజు ఉదయం అల్పాహార సమయంలో వేధిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలంటూ పట్టుబట్టారు. ఖైదీల దగ్గర సెల్ ఫోన్ లు ఉన్నాయంటూ అధికారులు వేధిస్తున్నారని.. ఖైదీలు ఆందోళన చెందుతున్నారు. కాగా ఇదే విషయమై ఆదివారం ఉదయం శివకుమార్ అనే మూగఖైదీ అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడ్డాడు. దీనిపై అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెల్ ఫోన్లు ఉన్నాయనే కారణంగానే జైలు సిబ్బంది ఆ ఖైదీని చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు మరో నలుగురి ఖైదీలు కూడా గాయపడ్డారు. అయితే శివకూమార్ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. ఆరోపణలు అవాస్తవని జైలు అధికారులు తెలిపారు.