హరితహారం కార్యక్రవుంలో భాగంగా వుండలంలోని ధర్మరావుపేట, బుధరావుపేట శివారులోని ఐనపల్లి, అశోక్‌నగర్‌తోపాటు....
ప్లాంటేషన్‌లో 5 లక్షల 60 వేల మొక్కలు
ఎండిపోతున్న గత ఏడాది మిగిలిన మొక్కలు
ఖానాపురం : హరితహారం కార్యక్రవుంలో భాగంగా వుండలంలోని ధర్మరావుపేట, బుధరావుపేట శివారులోని ఐనపల్లి, అశోక్‌నగర్‌తోపాటు పలు గ్రావూల్లో ఫారెస్ట్ అధికారులు మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. హరితహారం రెండో విడతలో వుండలంలో పెంచిన మొక్కలను నాటనున్నారు. ఐనపల్లిలో 50 వేల టేకు మొక్కలు, 60 వేల ఇతర రకాలు, అశోక్‌నగర్‌లో 2 లక్షల టేకు మొక్కలు, ఇతర రకాలు వురో 2 లక్షల మొక్కలు, ధర్మరావుపేటలో వురో 50 వేల మొక్కలు హరితహారానికి సిద్ధవువుతున్నారుు.
జూన్ నుంచి రెండో విడత హరితహారం కార్యక్రవుంలో మొక్కలు నాటే కార్యక్రవూన్ని చేపట్టనున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్నారు. ఐనపల్లిలో హరితహారం మొదటి విడతలో భాగంగా చేపట్టిన మొక్కల పెంపకంలో 40 వేల మొక్కలు మిగిలిపోయూరుు. దీంతో ప్రస్తుతం మొక్కలు పెద్దగా కావడంతో వేర్లు బ్యాగులో నుంచి భూమిలోకి పాతుకుపోతుండటంతో వాటిని తొలగించి పక్కనబెట్టారు. దీంతో పక్కకు పెట్టిన మొక్కలు ఎండిపోతున్నారుు.
వేర్లు భూమిలోకి వెళ్తున్నాయనే పక్కన పెట్టాం
ఎండిపోతున్న మొక్కల విషయూన్ని ఎఫ్‌ఆర్వో సుధీర్‌ను వివరణ కోరగా వేర్లు భూమిలోకి వెలుతుండటంతో బ్యాగుల్లో నుంచి తొలగించి పక్కన పెట్టాల్సి వచ్చిందని తెలిపారు.