‘ముందస్తు’ అలర్ట్‌ | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 28 2018 3:10 PM

Police Combing Operation In Adilabad Agency Area - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: ముందస్తు ఎన్నికలకు జిల్లా పోలీసు యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. ఎటువంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత పది రోజుల నుంచి జిల్లా సరిహద్దు ప్రాం తాలైన ప్రాణహిత, పెన్‌గంగ, పెద్దవాగు పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసులతోపాటు గ్రేహౌండ్స్, స్పె షల్‌ ప్రొటెక్షన్‌ పోర్స్‌ దళాలతోపాటు శిక్షణ కోసం వచ్చిన దళాలు రంగంలోకి దిగా యి. ఈ బలగాలు అటవీ ప్రాంతాలన్నింటి ని రోజు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల ఎవరైనా సంచరిస్తున్నారనే అనుమానంతో నిత్యం రాత్రింబగళ్లు గస్తీ కాస్తున్నాయి. జిల్లాకు సరిహద్దు గ్రామాలైన పెంచికల్‌పేట మండలం లోని నందిగాం, కమ్మర్‌గాం, దహెగాం మండలం మొట్లగూడ, రాంపూర్, చింతలమానెపల్లి గూ డెం, ప్రాణహిత పరిసరాలు, వాంకిడి మండలం సర్కపల్లితోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతా లు, కెరమెరి అడవులు, తిర్యాణి మండలం మంగి, గుండాల తదితర ప్రాంతాలపై గట్టి నిఘా జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం తో సహా కాగజ్‌నగర్‌ పట్టణంలో తనిఖీలు ము మ్మరం చేశారు. బాంబ్‌ స్క్వాడ్‌తో రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కేబీఎం కమిటీపై ప్రత్యేక దృష్టి
గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో రెండు దళాలు చురకుగా పనిచేసేవి. అందులో ఒకటి ఇంద్రవెల్లి ఏరియా దళం, రెండోది మంగి ఏరియా దళం. అయితే కాలక్రమేణా మావోల ప్రబల్యం తగ్గిపోవడంతో ప్రస్తుతం ఇంద్రవెల్లి దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఎక్కడా ఉమ్మడి జిల్లా పరి«ధిలో ఈ దళాల సారధ్యంలో ఎటువంటి ఘటన జరగలేదు. ఇక రెండోది తిర్యాణి మండలంలోని అత్యంత మారుమూల ప్రాంతమైన మంగి ఏరియా కమిటీ. ఈ దళం కూడా పూర్తిగా తన ఉనికి కోల్పోయింది. అయితే మావోయిస్టులు ప్రస్తుతం మంగి ఏరియా కమిటీ స్థానంలో కేబీఎం(కుమురంభీం, మంచిర్యాల) కమిటీని ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఈ కమిటీకి ఇన్‌చార్జీగా మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్, అలియాస్‌ నర్సన్న, అలియాస్‌ క్రాంతి పని చేస్తున్నారు. ఈయన స్వస్థలం ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పొచ్చెర గ్రామం. ఈయనతోపాటు బండి ప్రకాశ్‌ అలియాస్‌ బీపీ అలియాస్‌ ప్రభాకర్‌ అలియాస్‌ బండి దాదా ఈ కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈయన స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. వీరిద్దరూ సెంట్రల్‌ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. వీరివురు ప్రస్తుతం చత్తీస్‌ గడ్‌లో దండకారణ్యంలో ఉన్నట్లు నిఘా వర్గాల అంచనా. మైలారపు అడెల్లు ‘దండకారాణ్యం స్పెషల్‌ జోన్‌ కమిటీ’ (డీకేఎస్‌జెడ్‌సీ)ని ఏర్పాటు చేసి కొత్తవారిని మావోయిస్టు పార్టీలోని నియమిస్తూ రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలపై తమ ప్రతాపం చూపాలని ఆరాటపడుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. అంతేకాక ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాల్లో జిల్లా నుంచి మావోయిస్టు సానుభూతిపరులు, విప్లవ సాహితీవేత్తలు, విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కేబీఎం కమిటీ పేర ఓ ప్రకటన వెలువడింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు తెరలేపిన సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందే జిల్లా పోలీసు అప్రమత్తమైంది. గిరిజన యువత, ఆవాసాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ ఆవాసం నుంచి పోలీసులకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశారు. కొత్తవారు ఎవరూ వచ్చిన తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. అంతేకాక గతంలో జరిగిన సంఘటనలు, మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అధికారులు ఇతర అంశాలతో ఓ కరపత్రికను విడుదల చేయనున్నారు. అంతేకాక గోడప్రతుల ద్వారా గిరిజన గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు రూపొందించారు.

పది రోజులుగా కూంబింగ్‌
జిల్లా అటవీ ప్రాంతాల్లో సమీప పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న ఎస్సై సహా అందరూ వివిధ ఆపరేషన్లలో పాలుపంచుకుంటున్నారు. నక్సల్స్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోతోపాటు జిల్లా స్పెషల్‌ బ్రాంచితో ఎప్పటికప్పుడు సమచారం సేకరణ పనిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో మినహా దాదాపు మండల అన్ని కేంద్రాల్లోనూ సెల్‌ ఫోన్‌ పనిచేసేలా నెట్‌వర్క్‌ ఉంది. ఆయా మండల పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ గత పది రోజులుగా నిత్యం కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీ(ఆర్‌వోపీ)తో రోడ్లకు ఇరువైపు ఉన్న ప్రాంతాలను, కల్వర్టులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాంబ్‌ డిస్పోజబుల్‌ పార్టీ కూడా పనిచేస్తోంది. జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో తిర్యాణి మండలం దేవాపూర్‌ ప్రాంతంలో, మంగి మండలం పంగిడి మాదర ప్రాంతంలో పోలీసులకు తారసపడ్డారు. చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిపై నిర్మిస్తున్న గూడెం, అహెరి బ్రిడ్జి పనులు అడ్డగిస్తూ అక్కడ పొక్లెనర్లను, ఇతర వాహనాలు తగలబెట్టారు. అంతకు ముందు మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరు చెరుకూరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌ 2010 జూలై 1న వాంకిడి మండలం సర్కపల్లి వద్ద పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలో ఆస్థాయిలో ఘటనలు ఎప్పుడు జరగలేదు. రాష్ట్రమేర్పడినప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోనే మావోయిస్టుల ఉనికి పెద్దగా కనిపించలేదు. అయినప్పటి ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్‌స్టేషన్లను గుర్తించారు. వామపక్ష ప్రభావం ఉన్న పోలింగ్‌స్టేషన్లు 58, వామపక్ష ప్రభావం ఉన్న ప్రాంతాలు 53 వరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటికి ఎన్నికల సమయంలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయనున్నారు.

కూంబింగ్‌ కొనసాగుతోంది
జిల్లాలో ముందస్తు ఎన్నికల సందర్భం గా ఎటువంటి అ వాంఛనీయ ఘటనలు జరగకుండా గత పది రోజులుగా ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రాణహిత నది పరిసర ప్రాంతాలతోపాటు మంగి ఏరియాలో తనిఖీలు విస్తృతంగా సాగుతున్నాయి. ఎన్నికలు సజావుగా సాగేందుకు ముందుస్తుగా భద్రతపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.– మల్లారెడ్డి, ఎస్పీ

Advertisement
Advertisement