'మోసానికి మారు పేరు కేసీఆర్' | mothkupalli narasimhulu fires on kcr | Sakshi
Sakshi News home page

'మోసానికి మారు పేరు కేసీఆర్'

Mar 3 2015 6:55 PM | Updated on Aug 15 2018 9:27 PM

తెలంగాణ రాష్ట్రానికి దళితుడ్నితొలి ముఖ్యమంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

కరీంనగర్:  తెలంగాణ రాష్ట్రానికి దళితుడ్నితొలి ముఖ్యమంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.  కరీంనగర్‌లో మంగళవారం జరిగిన సభలో  మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ వాదాన్ని స్వార్ధానికి, తన కుటుంబ సంక్షేమానికి వాడుకున్నారని మోత్కుపల్లి దుయ్యబట్టారు.

కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. మోసానికి మారుపేరు అయిన కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ఈ నెల 9వ తేదీన ఇందిరా పార్కు వద్ద దూందాం కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement