మైనార్టీల సంక్షేమమే ఎంఐఎం లక్ష్యం

Minority Welfare is MIM's Aim says Asaduddin Owaisi - Sakshi

ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ

సాక్షి, నిర్మల్‌టౌన్‌: మైనార్టీల సంక్షేమమే ఎంఐఎం లక్ష్య మని ఏఐఏఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. జిల్లా కేంద్రంలోని బైల్‌బజార్‌లో సోమ వారం రాత్రి ఎంఐఎం బహిరంగసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్లుగా టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంతో కలిసి మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేసినట్లు తెలిపారు. షాదీముబారక్, మసీదు మౌజమ్, ఇమామ్‌లకు గౌరవ వేతనం వంటివి అమలు చేయించామన్నారు. అలాగే మైనార్టీల విద్య కోసం మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పా టు చేశామన్నారు. ఇందులో దాదాపు 50వేలమంది నిరుపేద విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారన్నారు. విద్యాభివృద్ధి జరిగితే భారత్‌ సూపర్‌ పవర్‌గా ఎదుగుతుందన్నారు. కేంద్రం, మైనార్టీల కోసం కేవలం రూ.3100 కోట్లను ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.2100 కోట్లను కేటాయించిందన్నారు. అలాగే మైనార్టీల కోసం సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.

నిరుద్యోగుల కోసం ట్యాక్సీలను అందించామన్నారు. ఇప్పటికీ దేశంలో ప్రతీ 100మంది గ్రాడ్యుయేట్‌లలో మైనార్టీలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారన్నారు. విదేశాలకు  వెళ్లే మైనార్టీలకు ప్రభుత్వం నేరుగా విదేశీ విద్యారుణం అందిస్తుందన్నారు. డిసెంబర్‌ 11 తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఇంటికి పోకతప్పదన్నారు. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని, సాధ్యమైనని ఎక్కువ సీట్లు గెలుస్తామన్నారు. నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రంలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదని, కేవలం నిర్మల్‌లో మసీదుపై దాడి జరిగిందన్నారు. ఈ కేసులో ఇరుక్కున్న అమాయక ముస్లింలను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం నిర్మల్‌ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అజీంబిన్‌ యాహియా, సయ్యద్‌ మజహర్, మున్సి పల్‌ కౌన్సిలర్‌ ప్రకాష్, రఫీఖురేషి, మాజీ వైస్‌ చైర్మన్‌ వాజిద్‌ అహ్మద్, నాయకులు ఫారుఖ్‌అహ్మద్, మహ్మద్‌ ఉస్మాన్, మహ్మద్‌ అన్వర్, సయ్యద్‌ అస్లమ్, పార్టీ నాయకులు లయఖ్‌ అలీ, మహ్మద్‌ ఖాన్, షేక్‌ ఇబ్రహీం, సయ్యద్‌ అశ్వక్, అహ్మద్‌ అలీ, సయ్యద్‌ సజ్జద్, శాదబ్‌ అలీ, ఎండీ అక్రం పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top