రూ.250 కోట్లతో 161వ జాతీయ రహదారిని విస్తరించనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు.
పెద్దశంకరంపేట (మెదక్) : రూ.250 కోట్లతో 161వ జాతీయ రహదారిని విస్తరించనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. గురువారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం జంబికుంటలో రూ.1.24 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. సంగారెడ్డి నుంచి నిజాంపేట వరకు 161వ జాతీయ రహదారిని 4 వరుసలుగా విస్తరించే పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే సంగారెడ్డి, జోగిపేట, పెద్దశంకరంపేటలో బైపాస్ రోడ్డులను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్క మెదక్ జిల్లాలోనే రూ.1000 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.