డాక్టర్‌ అవ్వాలకున్నాడు..కానీ! | Medicine Student Commit Suicide In Khammam | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ అవ్వాలకున్నాడు..కానీ!

Jul 3 2019 11:09 AM | Updated on Jul 3 2019 11:11 AM

Medicine Student Commit Suicide In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం : తమ బిడ్డను ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న ఆ తల్లిదండ్రుల కల నిరాశగానే మిగిలింది. కొడుకును డాక్టర్‌ చేయాలనే తపనతో తల్లిదండ్రులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. డాక్టర్‌గా తిరిగి వస్తాడనుకున్న కొడుకు విగత జీవిగా మారాడన్న వార్త విన్న తల్లిదండ్రులు తీరని శోకంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని బీరపల్లి గ్రామానికి చెందిన పుచ్చకాయల మురళీరెడ్డి, చంద్రావతి దంపతుల పెద్ద కుమారుడు సందీప్‌రెడ్డి (20)  సంగారెడ్డిలో ఉరివేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సందీప్‌రెడ్డి సంగారెడ్డి ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. డాక్టర్‌ కావాల్సిన కొడుకు తిరిగికాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరునుచూసి గ్రామంలో ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు. ఊహించని ఈ సంఘటనతో బీరపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement