ట్రాక్టర్ హైడ్రాలిక్ కిందకు దించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా అది మీద పడడంతో మృతిచెందాడు.
బోనకల్ (ఖమ్మం) : ట్రాక్టర్ హైడ్రాలిక్ కిందకు దించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా అది మీద పడడంతో మృతిచెందాడు. ట్రాక్టర్‌లో తెచ్చిన మట్టిని హైడ్రాలిక్ సాయంతో కింద పడేసిన తర్వాత హైడ్రాలిక్ అలాగే నిలిచిపోవడంతో ట్రక్ కింది భాగంలో ఉన్న ఎయిర్ పైపును సవరిస్తుండగా.. ఒక్కసారిగా ట్రక్ మీద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుజ్జర్లపుడి అశోక్(30) ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్ర మంలో శుక్రవారం ట్రాక్టర్ మరమ్మత్తు చేస్తుండగా.. హైడ్రాలిక్ ఒక్కసారిగా కిందకు రావడంతో ట్రక్ మీద పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.