సోమవారం ఓ వ్యక్తి పలుమార్లు బహిరంగంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానికులకు చెమటలు పట్టించాడు.
వరంగల్ : సోమవారం ఓ వ్యక్తి పలుమార్లు బహిరంగంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానికులకు చెమటలు పట్టించాడు. వివరాల్లోకి వెళ్తే... వరంగల్కు చెందిన రాజేష్(26) అనే వ్యక్తి కొన్ని రోజులుగా భార్యతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం మద్యం తాగి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి కరెంటు తీగలు పట్టుకోబోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని వారించి కిందకు దించారు.
కాగా ఆ వెంటనే పక్కనే దసరా రోడ్డులో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. దీంతో స్థానికులు సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు రంగంలోకి దిగి పలువిధాలా ప్రయత్నించి చివరకు రాజేష్‌ను జాగ్రత్తగా కిందకు దించారు. మద్యం మత్తులో ఉండటంతో అతనిని కుటుంబసభ్యులకు అప్పజెప్పారు.