పెట్టుబడి సాయం బాగుంది: మమ్ముట్టి

Mammootty Meets KTR In Hyderabad - Sakshi

మంత్రి కేటీఆర్‌తో మలయాళ సూపర్‌స్టార్‌ భేటీ   

సాక్షి, హైదరాబాద్‌ : మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావును కలిశారు. హైదరాబాద్‌లోని బేగంపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ నెల 25న రవీంద్రభారతిలో జరగనున్న ఇన్నిటెక్‌ అవార్డు ప్రదాన కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి కేటీఆర్‌ను మమ్ముట్టి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రాంత మలయాళీ అసోసియేషన్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. స్టార్టప్స్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అవార్డులను అందించనున్నట్లు మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలపై మమ్ముట్టి ఆసక్తి వ్యక్తం చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయం పథకంపై మమ్ముట్టి ప్రశంసలు కురిపించారు. కేరళ ప్రభుత్వ సహకారంతో శబరిమల దేవస్థానం వద్ద తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలతోపాటు, తెలంగాణలో ఉన్న మలయాళీలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా మమ్ముట్టికి వివరించారు.   
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top