చిన్న సమస్య కూడా రానివ్వద్దు

Mahender Reddy review of Election Security - Sakshi

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి

ఎన్నికల భద్రతపై డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికలకు ఏ చిన్న సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని, ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటేసేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల్లో భద్రతకు చేయాల్సిన ఏర్పా ట్లు, బందోబస్తు, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి తదితరాలపై సోమవారం రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో డీజీపీ సమీక్షించారు.

సమీక్షలో నార్త్‌జోన్‌ (వరంగల్‌) కింద ఉన్న జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, ఐజీ నాగిరెడ్డి, డీఐజీ ప్రమోద్‌కుమార్‌ పాల్గొన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో సున్నిత ప్రాంతా ల్లో జరిగిన అల్లర్లు, గొడవలు, ఇతరత్రా అంశాలపై ఆయా జిల్లాల ఎస్పీలు డీజీపీకి వివరించారు. బూత్‌స్థాయి వరకు భద్రతను పటిష్టం చేయడంతో పాటు ముందుస్తుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న నేరగాళ్లు, రౌడీషీటర్లను బైండోవర్‌ చేయడం, వారిపై నిఘా పెట్టాలని సూచించినట్లు సమాచారం.

మావో ప్రభావిత జిల్లాల్లో అలర్ట్‌..
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు మావోలు యత్నించే అవకాశముందని ఇంటెలిజెన్స్‌ అధికారులు ఎస్పీలు, కమిషనర్లకు సూచిం చినట్లు తెలిసింది. మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో దిగుతున్న ప్రతి అభ్యర్థి భద్రతను పర్యవేక్షించాలని, మావో గెరిల్లా దాడులకు అవకాశం లేకుం డా చూసుకోవాలని, ఇందుకు స్పెషల్‌ ఇంటలిజెన్స్‌ బ్యూరో అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. 

అలాగే రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు చేపట్టేందుకు పోలీస్‌ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్‌ ఎన్నికల కమిషన్‌ సీఈవో రజత్‌కుమార్‌తో సోమవారం భేటీ అయ్యారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై కోఆర్డినేషన్‌ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు జితేందర్‌ తెలి పారు.  రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ సిబ్బంది ఈ నెల 12 నుంచి శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top