టీడీపీ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు | Madhavaram krishna rao meets Nara lokesh | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు

Jan 26 2015 2:38 PM | Updated on Aug 29 2018 3:37 PM

టీడీపీ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు - Sakshi

టీడీపీ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు

తెలుగుదేశం పార్టీకి చెందిన హైదరాబాద్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాంబు పేల్చారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన హైదరాబాద్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాంబు పేల్చారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలందరూ అధికార టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని, ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్కు చెప్పానని కృష్ణారావు వెల్లడించారు.

కృష్ణారావు టీడీపీని వీడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో సోమవారం  ఆయన నారా లోకేష్ను కలిశారు. అనంతరం మీడియాలో మాట్లాడుతూ.. లోకేష్ పిలిస్తేనే వెళ్లి కలిశానని చెప్పారు. పార్టీ మారుతున్నానని వచ్చిన వార్తలపై లోకేష్ వివరణ అడిగారని తెలిపారు. పార్టీ మారే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కృష్ణారావు చెప్పారు. ఏపీకి చెందిన 26 బీసీ కులాలను తెలంగాణలో బీసీ కేటగిరి నుంచి తొలగించారని, ఈ విషయాన్ని అసెంబ్లీలో తాను చర్చకు తీసుకువచ్చినా పార్టీ నాకు అండగా నిలవలేదని అన్నారు. బీసీ కులాలకు న్యాయం జరిగేలా ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని వెల్లడించారు. టీఆర్ఎస్ ఆ కులాలకు న్యాయం చేస్తే పార్టీ మారే విషయం ఆలోచిస్తానని కృష్ణారావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement