జనాభా దినోత్సవం సందర్భంగా లక్కీడిప్‌ | Lucky Deep on the occasion of Population Day | Sakshi
Sakshi News home page

జనాభా దినోత్సవం సందర్భంగా లక్కీడిప్‌

Jul 11 2018 10:58 AM | Updated on Jul 11 2018 10:58 AM

Lucky Deep on the occasion of Population Day - Sakshi

 లక్కీడిప్‌ తీస్తున్న కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు 

సంగారెడ్డి టౌన్‌ : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక బిడ్డ, ఇద్దరు ఆడ పిల్లల తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయిం చుకున్న వారిని ప్రోత్సహించడంలో భాగంగా మంగళవారం కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తన చాంబర్‌లో లక్కీడిప్‌ తీశారు. ఒకే బిడ్డ గల జహీరాబాద్‌ మండలం శేఖాపూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మి, రాములు దంపతులు, పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన వి.కళావతి, శేఖర్‌ దంపతులు లక్కీడిప్‌లో గెలుపొందారు.

వీరికి ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున బహుమతి ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మోజిరాం రాథోడ్, డాక్టర్‌ గాయత్రీదేవి, డాక్టర్‌ శశాంక్‌ తదితరులు పాల్గొన్నారు. 

నేడు ర్యాలీ..

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మోజిరాం రాథోడ్‌ తెలిపారు. కార్యక్రమాన్ని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభిస్తారని, అనంతరం కార్యాలయంలో సమావేశం ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement