సినీ ప్రముఖులతో భేటీకానున్న కేసీఆర్ | kcr to meet Tollywood persons | Sakshi
Sakshi News home page

సినీ ప్రముఖులతో భేటీకానున్న కేసీఆర్

Aug 4 2014 6:13 PM | Updated on Oct 2 2018 3:27 PM

సినీ ప్రముఖులతో భేటీకానున్న కేసీఆర్ - Sakshi

సినీ ప్రముఖులతో భేటీకానున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో సమావేశం కానున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి  కే చంద్రశేఖర్ రావు త్వరలో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో సమావేశం కానున్నారు. హైదరాబాద్లో ఫిలింసిటీ నిర్మిస్తామని ఇటీవల ప్రకటించిన కేసీఆర్ స్థలం ఎక్కడైతే బాగుంటుందో సినీ పరిశ్రమ వారితో చర్చించనున్నారు.

కేసీఆర్తో్ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు. హైదరాబాద్లో  ఫిలింసిటీ నిర్మించాలన్న కేసీఆర్ నిర్ణయంపై వారు హర్షం చేశారు.  హాలీవుడ్ స్థాయిలో ఫిలింసిటీ నిర్మిస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. సినిమా, సీరియల్స్‌ అన్ని సాంకేతిక అవసరాలకు ఉపయోగపడేలా ఫిలిం సిటీ నిర్మిస్తామని తెలిపారు. కేసీఆర్ ఈ విషయంపై సినీ ప్రముఖులతో చర్చించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement