మంత్రిగా ఐకే రెడ్డి బాధ్యతల స్వీకరణ | ik reddy adoption as minister | Sakshi
Sakshi News home page

మంత్రిగా ఐకే రెడ్డి బాధ్యతల స్వీకరణ

Dec 27 2014 12:53 AM | Updated on Sep 2 2017 6:47 PM

మంత్రిగా ఐకే రెడ్డి బాధ్యతల స్వీకరణ

మంత్రిగా ఐకే రెడ్డి బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర న్యాయ, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రిగా..

ఇంద్రకరణ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, తదితరులు..
 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర న్యాయ, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రిగా నియమితులైన నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సచివాలయంలోని ఆయన చాంబర్‌లో బాధ్యత లు చేపట్టారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఇంద్రకరణ్‌రెడ్డికి చోటు దక్కిన విషయం విధితమే. ఈ మేరకు ఆయన ఈనెల 16న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డికి సహచర మంత్రి జోగు రామన్న పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాలూరి గోవర్ధన్‌రెడ్డి, ఏనుగు సురేందర్‌రెడ్డి, పలువురు జిల్లా ముఖ్యనేతలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement