నాగార్జునసాగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

Huge Traffic Jam At Nagarjuna Sagar - Sakshi

సాక్షి, నల్గొండ : నాగార్జునసాగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలబడిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గురువారం 26 డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో నాగార్జునసాగర్ జలాశయం సుందరంగా మారింది. దీనికి తోడు సెలవు రోజు కావడంతో సాగర్ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో  డ్యామ్‌ వద్ద భారీగా జనం చేరి వాహనాలు రోడ్డుపై నిలబడిపోయాయి. దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఆంక్షలు పెట్టినా వాహనదారులు పట్టించుకోకపోవటం గమనార్హం. ట్రాఫిక్ క్లియర్ చెయ్యలేక పోలీసులు చెతులేత్తేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top