25 నుంచి హైకోర్టుకు దసరా సెలవులు | Holidays for high court on 25th | Sakshi
Sakshi News home page

Sep 23 2017 2:17 AM | Updated on Jul 29 2019 6:03 PM

Holidays for high court on 25th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టుకు ఈ నెల 25 నుంచి అక్టోబర్‌ 2 వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. అత్యవసర కేసుల వారు 25న పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. వాటిపై కోర్టు 27న విచారణ జరుపుతుంది. న్యాయమూర్తులు జస్టిస్‌ బి.శివశంకరరావు, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన ధర్మాసనం కేసులను విచారిస్తుంది. సింగిల్‌గా జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి విచారణ జరుపుతారు. సెలవుల అనంతరం అక్టోబర్‌ 3న కోర్టు పునఃప్రారంభమవుతుందని రిజిస్ట్రార్‌ జనరల్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement