రంగారెడ్డి కోర్టు ఆవరణలో ఉద్రిక్తత | high tension in rangareddy court | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి కోర్టు ఆవరణలో ఉద్రిక్తత

Jun 22 2016 11:49 AM | Updated on Mar 28 2018 11:26 AM

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లాయర్లు బుధవారం ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలో ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లాయర్లు బుధవారం ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలో ఆందోళనకు దిగారు. న్యాయమూర్తులకు తెలంగాణ ఆప్షన్ ఇవ్వద్దంటూ లాయర్లు రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లాయర్ల నినాదాలతో కోర్టు సముదాయం దద్దరిల్లింది.

దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి.... ఆందోళన చేస్తున్న లాయర్లను అడ్డుకున్నారు. కొందరు లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని... వాహనాల్లో ఎల్బీ నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement