మున్సిపల్‌ ఎన్నికలు‌.. విచారణ వాయిదా

High Court On Telangana Municipal Elections Notification - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌లో నిబంధనలు పాటించడం లేదని దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల నియమావళిని తమ ముందు ఉంచాలని ఈసీని ఆదేశించింది. అయితే ఈ సందర్భంగా ఎన్నికల మాన్యువల్‌ అందుబాటులో లేదని తెలిపిన ఎన్నికల సంఘం.. రేపటి వరకు గడువు కోరింది.

దీంతో రేపు సాయంత్రం వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయవద్దని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రేపు ఉదయం 10.30 గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ జరపనున్నట్టు తెలిపింది. కాగా, రేపు మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top