బాసరలో పోటెత్తిన భక్తజనం | heavy crowd of basara | Sakshi
Sakshi News home page

బాసరలో పోటెత్తిన భక్తజనం

Oct 2 2014 1:19 AM | Updated on Sep 2 2017 2:14 PM

బాసరలో పోటెత్తిన భక్తజనం

బాసరలో పోటెత్తిన భక్తజనం

ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలంలోని సుప్రసిద్ధ బాసర సరస్వతీ క్షేత్రంలో బుధవారం మూలా నక్షత్ర మహా సరస్వతీ పూజలు జరిగాయి.

భైంసా/బాసర : ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలంలోని సుప్రసిద్ధ బాసర సరస్వతీ క్షేత్రంలో బుధవారం మూలా నక్షత్ర మహా సరస్వతీ పూజలు జరిగాయి.  వివిధ ప్రాంతాల నుంచి 1,980 మంది చిన్నారులకు ఈ సందర్భంగా అక్షర శ్రీకార పూజలు చేయించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మూలనక్షత్ర పర్వదినాన తన మనవళ్లు రితిశ్, రిశాంత్‌లకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. జిల్లా జడ్జి గోపాలకృష్ణమూర్తి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, జేడీఏ రోజ్‌లీలాతోపాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 40 వేలకు మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement