
దరఖాస్తు పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్ రాహుల్‌రాజ్
బెల్లంపల్లి : పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అసెంబ్లీ నియోజకవర్గంలోని మారు మూల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు అర్జీలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన సబ్ కలెక్టర్ సంబంధిత శాఖలకు బదలాయింపు చేశారు. మొత్తం 40 వరకూ అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.