టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ | golden Telangana Possible with TRS party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ

Nov 6 2017 9:39 AM | Updated on Nov 6 2017 9:39 AM

golden Telangana Possible with TRS party - Sakshi

అర్వపల్లి (తుంగతుర్తి) : బంగారు తెలంగాణ నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం జాజిరెడ్డిగూడెంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని గ్రహించిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

పార్టీలో చేరిన వారిలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మొరిశెట్టి ఉపేందర్, మాజీ ఎంపీపీ మీలా చంద్రకళ, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇందుర్తి వెంకట్‌రెడ్డి, దండ వీరారెడ్డి, మీలా కిష్టయ్య, కాపా వెంకటేశ్వర్‌రావు, కె.సోమిరెడ్డి, పెద్దయ్య, భూమయ్య, కుంభం నర్సయ్య, లింగమల్లు, రాంమ్మల్లు, అనిరెడ్డి శేఖర్‌రెడ్డి, దోరేపల్లి వెంకటయ్య ఉన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ఎల్‌.కిషన్‌రావు, గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మొరిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ దావుల మనీషావీరప్రసాద్, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పాశం విజయయాదవరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కుంట్ల సురేందర్‌రెడ్డి, అంబయ్య, దావుల వీరప్రసాద్, పాశం యాదవరెడ్డి, బి.రామలింగయ్య, ఎర్రనర్సయ్య, వైస్‌ ఎంపీపీ వెంకన్న, సర్పంచ్‌లు ప్రమీల, జీడి వీరస్వామి, వి.గంగయ్య, మన్నె లక్ష్మినర్సు, పద్మ, మామిడి సోమయ్య, మామిడి సత్యనారాయణ, హరిప్రసాద్, కె. మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement