నడిరోడ్డుపై శిశువు మృతదేహం | girl child found at road divider | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై శిశువు మృతదేహం

Oct 14 2017 12:14 PM | Updated on Sep 4 2018 5:07 PM

మహానగరంలో పట్టపగలు దారుణ సంఘటన వెలుగుచూసింది.

సాక్షి, హైదరాబాద్‌: మహానగరంలో పట్టపగలు దారుణ సంఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని దుండగులు రోడ్డు మధ్యలో డివైడర్‌ పై వదిలి వెళ్లారు. ఈ సంఘటన ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వనస్థలిపురంలో శనివారం వెలుగు చూసింది.

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌పై మృత శిశువు ఉండటం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement