తాండూరులో రెచ్చిపోయిన దొంగలు | five houses thefts in ranga district tandur | Sakshi
Sakshi News home page

తాండూరులో రెచ్చిపోయిన దొంగలు

Jun 11 2016 11:27 AM | Updated on Aug 30 2018 5:27 PM

రంగారెడ్డి జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. తాండూరు తులసీనగర్‌లో శనివారం తెల్లవారు జామున ఐదిళ్లలో చోరీకి పాల్పడ్డారు.

తాండూరు: రంగారెడ్డి జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. తాండూరు తులసీనగర్‌లో శనివారం తెల్లవారు జామున ఐదిళ్లలో చోరీకి పాల్పడ్డారు.

స్థానిక సిద్ధివినాయక ఆలయం వీధిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్రామయ్య నివాసముంటున్న కింది పోర్షన్‌తో పాటు ఐదు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు నగలు, నగదు దోచుకెళ్లారు. దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌ చేసుకుని  స్వైరవిహారం చేశారు. ఇళ్ల యజమానులు వివిధ పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ఈ చోరీలు జరిగాయి. గమనించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. ఇంటి యజమానులు వస్తేకాని చోరీ వివరాలు తెలియవని చెబుతున్నారు. సీఐ ఇంటి సమీపంలో చోరీ జరగడం స్థానికులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement