జాతీయ దృక్పథంతో కాంగ్రెస్‌ను గెలిపించండి

Fighting between  BJP Alliance and Congress Coalition: Ponnam - Sakshi

బీజేపీ కూటమి, కాంగ్రెస్‌ కూటమికి మధ్యే పోరు: పొన్నం

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ దృక్పథంతో ఆలోచించి తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ కూటమిని గెలిపిం చాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలో ని వార్‌రూమ్‌లో పార్టీ కోర్‌ కమిటీ అన్ని రాష్ట్రా ల పీసీసీ అధ్యక్షులతో సమావేశమైంది. లోక్‌సభ ఎన్నికలకు సన్నాహక చర్యలపై చర్చిం చింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన తరఫున పొన్నం హాజరయ్యారు. పార్టీ ఫండ్‌ సేకరణపై కూడా చర్చించినందున ఈ సమావేశానికి కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కూడా హాజరయ్యారు. కోర్‌ కమిటీ సభ్యులు అహ్మద్‌ పటేల్, ఏకే ఆంటోనీ, జైరాం రమేశ్, మల్లికార్జు న్‌ ఖర్గే, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా పాల్గొన్నారు. అనంతరం పొన్నం మాట్లాడారు. ‘దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలున్నా ఈ ఎన్నికలు మోదీ నేతృత్వంలోని బీజేపీ కూటమికి, రాహుల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ కూటమికి మధ్య జరుగుతున్న పోరు.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను అధికారంలో తేవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోని అన్ని సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ‘రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సంస్థాగతంగా లేదా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్న ఆలోచనలో ఏఐసీసీ కోర్‌ కమిటీ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్నీ తయారు చేసుకున్నా.. ఫలితాలు వేరేలా రావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం, మోదీ వైఫల్యాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లడం, మేనిఫెస్టోలో పెట్టాల్సిన అం శాలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం వంటి అంశాలపై చర్చ జరిగింది. శక్తి యాప్‌ ద్వారా పార్టీ శ్రేణులు ప్రతి గ్రామంలో ఇంటిం టికీ చేరువవ్వాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.

పార్టీకి విరాళాల సేకరణ: గూడూరు
పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల వ్యయం తదితర అవసరాలకు ప్రజల నుంచి విరాళాలు సేకరిం చాలని పార్టీ నిర్ణయించినట్లు గూడూరు నారాయణరెడ్డి పేర్కొన్నారు. ‘జనసంపర్క్‌ అభియాన్‌ ద్వారా రూ.25 నుంచి రూ.2 వేల వరకు పార్టీ ఫండ్‌ తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. తెలంగాణలో రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు జాతీయ దృక్పథంతో ఆలోచించి ఆశీ ర్వదిస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top