గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలిలో ఆదివారం ఓ రైతు భార్య ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయం కోసం తన భర్త చేసిన అప్పు చెల్లించ లేమనే భయంతో భార్య కమల (50)పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది.
గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలిలో ఆదివారం ఓ రైతు భార్య ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన కాంటువాడి కట్టమల్లు అనే రైతు తన ఎకరం భూమితో పాటు రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, ఇతర పంటలను సాగు చేసేవాడు. రెండు ఏళ్ల నుంచి దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో రూ. 3 లక్షల మేరకు అప్పులు అయ్యాయి. అంత అప్పు తన భర్త చెల్లించలేడని దిగులు చెంది అతడి భార్య కమల (50) శనివారం ఉదయం పురుగుల మందుతాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం కమల మృతి చెందింది. కమలకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేశ్వర్‌రావు తెలిపారు.