పొలంలో వన్యప్రాణుల కోసం వేసిన కరెంటు తీగ ఓ రైతు ప్రాణాన్ని బలి తీసింది.
కరీంనగర్: పొలంలో వన్యప్రాణుల కోసం వేసిన కరెంటు తీగ ఓ రైతు ప్రాణాన్ని బలి తీసింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రైతు సంబాని(45) గురువారం ఉదయం చేనుకు వెళ్లాడు. పక్కనే ఉన్న మొక్కజొన్న చేను యజమాని ఎలుగుబంట్లు, అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు వేసిన కరెంటు తీగ అతడి కాలికి తాకింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురైన రైతు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.