క్షమాపణ కోరితే వదిలేద్దాం.. :కేసీఆర్‌ | excused when they apologised :cm kcr | Sakshi
Sakshi News home page

క్షమాపణ కోరితే వదిలేద్దాం.. :కేసీఆర్‌

Mar 11 2017 3:03 AM | Updated on Jul 29 2019 6:58 PM

క్షమాపణ కోరితే వదిలేద్దాం.. :కేసీఆర్‌ - Sakshi

క్షమాపణ కోరితే వదిలేద్దాం.. :కేసీఆర్‌

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగంపై ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరుపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగంపై ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరుపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రసంగం పూర్తి కాకుండానే కాంగ్రెస్‌ వాకౌట్‌ చేయడం, టీడీపీ సహా మిగిలిన ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరుపై సీఎం ప్రగతిభవన్‌లో శుక్రవారం రాత్రి సమీక్షించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు మరికొందరు మంత్రులు ఇందులో పాల్గొన్నారు. గవర్నర్‌ను అగౌరవపరిచేలా వ్యవహరించిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్‌ చేయకూడదని మంత్రులను కేసీఆర్‌ ప్రశ్నించినట్టుగా సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

దీనిపై సభలో క్షమాపణలు అడిగితే వదిలిపెట్టాలని, లేకుంటే సస్పెండ్‌ చేయాలని నిర్ణయిం చినట్టుగా తెలిసింది. ఏపీ అసెంబ్లీలో కూడా గవర్నర్‌ ప్రసంగం పూర్తయ్యే దాకా ప్రతి పక్షం ఓపికగా ఉందని గుర్తుచేశారు. గవర్నర్‌ ప్రసంగంపై ఏమైనా అభ్యంతరాలుంటే ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడొచ్చని, వీలుకాకుంటే నిరసనలను తెలియజేయవచ్చునని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ను అగౌరవపరిచిన సభ్యుల పట్ల క్షమాపణ చెప్పేదాకా ఉపేక్షించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement