భూకంపం వస్తోందని వదంతులు | earthquake has been a rumor in nizamabad | Sakshi
Sakshi News home page

భూకంపం వస్తోందని వదంతులు

Aug 21 2014 3:15 AM | Updated on Oct 17 2018 6:06 PM

భూ కంపం వదంతులతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భూ కంపం వదంతులతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి తెల్లవార్లూ రోడ్లపైనే గడిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటల ప్రాంతం లో భూకంపం వస్తోందని వదంతులు వ్యాపించాయి.

బంధువులు, తెలిసినవారి నుంచి ఫోన్‌లు రావడంతో నిద్రలో ఉన్నవారు గాబ రాతో పిల్లాపాపలను తీసుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మహారాష్ర్ట నుంచి జిల్లాకు భూకంపంపై పుకార్లు షికార్లు చేసినట్లు తెలుస్తోంది. ముంబ యి, భీవండి, పూణె, జాల్నా, నాందేడ్ తదితర ప్రాం తాలలో స్థిరపడిన తెలుగువారు ఇక్కడి బంధువులకు ఫోన్ చేసి భూకంపం వదంతులపై సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలోని కొన్నిచోట్ల మంగళవారం రాత్రి పదిగంటల వరకు కూడా సాగింది.
 
 అలసి, సొలసి నిద్రిస్తున్న వేళ
 పొద్దంతా పనిచేసిన ఎన్యూమరేటర్లు, వివరాల నమోదు కోసం ఇళ్లను వదలకుండా ఎదురు చూసిన ప్రజలు అలసిపోయి నిద్రిస్తున్న వేళ వచ్చిన ఫోన్‌లు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. జనాలు తెల్లవార్లూ జాగారం చేయాల్సి వచ్చింది. యువకులు బైకులు తీసుకొని రోడ్లపైకి వచ్చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలలోని చా య్ హోటళ్ల వద్ద చాలా మంది టైంపాస్ చేస్తూ బంధు, మిత్రులకు ఫోన్‌లు చేశారు.

భూకంపం పుకారు విదేశాలను సైతం తాకాయి. ప్రవాస భారతీయులు జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతానికి ఫోన్ చేసి తమ వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి  ఇక్కడి బంధువుల కు ఫోన్‌లు వచ్చాయి. బాల్కొండ, భీమ్‌గల్, బిచ్కుంద, నిజాంసాగర్, లింగంపేట, డిచ్‌పల్లి, కమ్మర్‌పల్లి, నాగిరెడ్డిపేట, వర్ని,నందిపేట, మాచారెడ్డి, మండలాల్లో భూకంప వదంతులు భయపెట్టాయి. బోధన్ శక్కర్‌నగర్‌లో పలు కాలనీలలో ప్రజలను నిద్ర లేపడానికి యువకులు పటాకులు కాల్చారు.

 మరికొన్ని కాలనీలలో వార్డు కౌన్సిలర్‌లు ఇంటింటికి తిరుగుతూ ప్రజలను నిద్రలేపారు. భిక్కనూరు మండలంలో గల్ఫ్ దేశాల నుంచి ఫోన్ చేస్తూ తమ వారిని భూకంపంపై హెచ్చరించారు. బాన్సువాడ నియోజకవర్గం లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బడాపహాడ్ నుంచి వదంతులు వ్యాపిం చినట్లు కూడా చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement