త్వరలో డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా పటాన్‌చెరులో మాట్లాడారు.
విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
హైదరాబాద్: త్వరలో డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా పటాన్‌చెరులో మాట్లాడారు. రాష్ట్రంలో తెలంగాణేతర ఉద్యోగుల బదిలీలను త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్రం నుంచి నిర్ణయం వచ్చిన వెంటనే డీఎస్సీతో పాటు అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారన్నది అపోహ మాత్రమేనన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకునేలా తెలంగాణ విద్యాసంస్థలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.