ఆత్మహత్యాయత్నా నికి పాల్పడిన టీఆర్‌ఎస్ నేత అయూబ్‌ఖాన్ పరిస్థితి మూడు రోజులు గడిస్తే తప్ప చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు.
టీఆర్‌ఎస్ నేత అయూబ్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు
తాండూరు: ఆత్మహత్యాయత్నా నికి పాల్పడిన టీఆర్‌ఎస్ నేత అయూబ్‌ఖాన్ పరిస్థితి మూడు రోజులు గడిస్తే తప్ప చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. బుధ వారం వికారాబాద్ జిల్లా తాండూ రులో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ నేత అయూబ్‌ఖాన్ మంత్రి మహేందర్‌రెడ్డి ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్న విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన అతడిని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అయూబ్‌ఖాన్‌ను గురువారం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రి మహేందర్‌రెడ్డి పరామర్శించారు.