భారీగా వాహనాలు సీజ్ : సజ్జనార్‌ | CP Sajjanar requests people to be in home over lock down | Sakshi
Sakshi News home page

భారీగా వాహనాలు సీజ్ : సజ్జనార్‌

Apr 23 2020 1:45 PM | Updated on Apr 23 2020 3:02 PM

CP Sajjanar requests people to be in home over lock down - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సైబరాబాద్‌లో సీపీ సజ్జనార్‌ గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని చెక్‌పోస్టులను అత్యవసరంగా తనిఖీ చేశారు. మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సజ్జనార్ స్వయంగా వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను భారీగా సీజ్ చేశారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 వేల వాహనాలు సీజ్ చేశామని సజ్జనార్‌ అన్నారు. శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు. ఐటీ సెక్టార్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, దయచేసి ఎవరూ రోడ్లపైకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. వాహనాల పాసులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులకు సహకరిస్తున్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. రెండవదశ లాక్‌డౌన్‌కు ప్రజలు అందరూ  సహకరించాలని, ఇంట్లోనే సేఫ్‌గా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement