లెక్క తప్పిన ఆడిట్ | Count missed Audit | Sakshi
Sakshi News home page

లెక్క తప్పిన ఆడిట్

Jul 3 2015 11:46 PM | Updated on Sep 3 2017 4:49 AM

లెక్క తప్పిన ఆడిట్

లెక్క తప్పిన ఆడిట్

సంగారెడ్డి మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ పాండు...

కంచే చేను మేయడమంటే ఇదేనేమో! ఉద్యోగులు ‘లెక్క’ తప్పకుండా చూడాల్సిన ‘ఆడిట్ అధికారులు’ కాసులివ్వలేదని తప్పుడు నివేదికలిచ్చారు. గతంలో చేసిన ఆడిటింగ్‌నే మళ్లీ చేయాలంటూ... ఓ ఉద్యోగిపై నింద మోపి అతడి సస్పెండ్‌కు కారణమయ్యారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో పురివిప్పిన తాజా అక్రమ బాగోతం ఇది.  
 
- ఉన్న బిల్లు పుస్తకాలు లేవని తప్పుడు నివేదిక
- దాన్నిబట్టే ఉద్యోగిని బలిచేసిన అధికారులు
- లంచం ఇవ్వనందుకే: ఉద్యోగి
సంగారెడ్డి మున్సిపాలిటీ:
సంగారెడ్డి మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ పాండు. 2010-11కు సంబంధించిన రెండు బిల్ బుక్కులర శీదులతో పాటు డబ్బులను కార్యాలయంలో అతను జమచేశాడు. కానీ ఎలాంటి సొమ్ము పాండు జమ చేయలేదని ఇటీవల ఆడిట్ నిర్వహించిన అధికారులు మున్సిపల్ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా... గత నెల 18 జరిగిన మున్సిపల్ పబ్లిక్ అకౌంట్ కమిటీ సమావేశంలో పాండును సస్పెండ్ చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

ఈ మేరకు పాండును విధుల నుంచి తొలగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మనస్థానికి గురైన పాండు... బుధవారం కార్యాలయంలోని అన్ని రికార్డులను పరిశీలించారు. పాండుకు సంబంధించిన బుక్ నంబర్ 277, 337 రెండింటికీ కార్యాలయంలో ఐఆర్ రికార్డు లభించింది. వాటిని పరిశీలిస్తే 2010లో అప్పటి అకౌంటెంట్ ఆంజనేయులుకు,  2011లో లత అనే అకౌంటెంట్‌కు బిల్లు బుక్కులకు సంబంధించిన సొమ్ము చెల్లించినట్లుగా ఉంది. కానీ ఆడిటింగ్ అధికారులు మాత్రం ఈ నెంబర్లున్న బిల్ పుస్తకాలు సమర్పించలేదంటూ పాండుపై అభియోగం మోపారు. అతని ఉద్యోగానికే ఎసరు పెట్టారు.  
 
రికార్డుల్లో ఉన్నా...   
తాను ఆడిటింగ్ అధికారులు అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతోనే తనపై తప్పడు నివేదికలు ఇచ్చినట్లు మున్సిపల్ బిల్లు కలెక్టర్ పాండు ఆరోపిం చారు. తన రెండు బిల్ బుక్స్‌కూ సంబంధించిన డబ్బులను అప్పుడే అకౌంట్స్ అధికారులకు చెల్లించి ఐఆర్ రికార్డులో రాయించుకోవడం జరిగిందన్నారు. ఆడిటింగ్ అధికారులు కొంత సొమ్మ ఇవ్వాలని డిమాండ్ చేశారని, అందుకు తాను నిరాకరించినందుకు తనపై ఇలా తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు. సదరు అధికారులు కార్యాలయంలోనే బిల్ బుక్స్ దాచిపెట్టారన్నారు.
 
అవును... నిజమే...

‘బిల్ కలెక్టర్ పాండుకు సంబంధించిన రెండు బిల్ బుక్స్ పోయినట్లుగా ఆడిటింగ్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అతడిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అయితే సదరు బుక్స్, సొమ్ము కార్యాలయంలో జమచేసినట్లుగా ఐఆర్ రికార్డు లభించిం ది. ఈ క్రమంలో పాండుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసే లా అనుమతివ్వాలని ఉన్నతాధికారులకు పంపాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని మున్సిపల్ కమిషనర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement