రేపటి నుంచి చరిత్ర, సాహిత్యాలపై సదస్సు

Conference on History and Literature - Sakshi

రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ సిధారెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: చరిత్ర, సాహిత్యాలపై ఈ నెల 23 నుంచి రెండ్రోజుల పాటు రవీంద్రభారతిలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు. చర్రితలో చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్ర సాహిత్య అకాడమీ, వారధి సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల నుంచి అసఫ్‌జాహిల వరకు రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం అనే అంశాలపై సదస్సు జరుగుతుందన్నారు.

నాణేల ఆధారంగా తెలంగాణ చరిత్రను పరిశోధకులు రాజారెడ్డి, మనం మరిచిన తెలంగాణ చరిత్రపై జితేంద్రబాబు, కాకతీయుల నాటి లిపి విశేషాలు, లేఖన సంప్రదాయాలపై ఉమామహేశ్వర శాస్త్రి పత్ర సమర్పణ చేస్తారన్నారు. ప్రముఖ చరిత్రకారులు సూర్యకుమార్‌ కాకతీయుల కొత్త శాసనాలపై, ఆచార్య ఎం. సుజాతరెడ్డి కుతుబ్‌షాహి కాలం నాటి తెలుగు భాషా వికాసంపై, స్వతంత్ర కాకతీయ పాలకుల వివరాలపై శ్రీనివాసులు పత్ర సమర్పణ చేస్తారన్నారు. సదస్సు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందన్నారు. సమావేశంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top