పెండింగ్‌ పనులు పూర్తి  చేయండి: మల్లారెడ్డి  | Complete Pending Tasks CH Malla reddy | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనులు పూర్తి  చేయండి: మల్లారెడ్డి 

Apr 21 2019 4:55 AM | Updated on Apr 21 2019 4:55 AM

Complete Pending Tasks CH Malla reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కార్మిక శాఖలో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి సీహెచ్‌.మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. కార్మిక, పరిశ్రమ, ఉపాధి కల్పన శాఖ అధికా రులతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి నిర్ణీత గడువులోగా  పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శాఖాపరంగా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పూర్తి చేసిన పెండింగ్‌ పనులను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
Advertisement