జిల్లా కోసం కామారెడ్డి ప్రజలు పోరుబాట పట్టిండ్రు.
కామారెడ్డి/కామారెడ్డి టౌన్: జిల్లా కోసం కామారెడ్డి ప్రజలు పోరుబాట పట్టిండ్రు. జిల్లా సాధ నా సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కామారెడ్డి బంద్ విజయవంతమైంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు బంద్ కు మద్దతుగా పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. జేఏసీ డివిజన్ కన్వీనర్ జి. జగన్నాథం, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శెనిశెట్టి గౌరీశంకర్ ఆధ్వర్యంలో నేతలు ఆందోళన లో పాలు పంచుకున్నారు.
బస్టాండ్ గేట్ల వద్ద బైఠాయించి బస్సులు తిరగకుం డా అడ్డుకున్నారు. దుకాణాలు, హోటళ్లు, పాఠశాలలు, బ్యాంకులు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలన్నింటినీ మూసి ఉంచారు. పట్టణంలో తిరుగుతూ దుకాణాలను మూయించారు. బంద్‌లో జేఏసీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ, న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐతో పాటు విద్యార్థి, ప్రజాసంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో
చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారసంస్థలను బంద్ చేశారు. ఈ సందర్భంగా జేపీఎన్ రోడ్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో అధ్యక్షుడు గౌరీశంకర్, జేఏసీ కన్వీనర్ జగన్నాథం, వివిధ పార్టీల నాయకులు ప్రసగించారు. కామారెడ్డిని జిల్లాగా ప్రకటించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హె చ్చరించారు. కిరాణా, రైస్, మెడికల్, బట్టల, బంగారు దుకాణాల యజమానులు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో
కాంగ్రెస్, బీజేపి, టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ప్రధాన వీధులలో ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, జడ్‌పీటీసీ సభ్యుడు నిమ్మ మోహన్‌రెడ్డి, నాయకులు మసూద్, రాంకుమార్, మామిండ్ల ఆంజయ్య, పిప్పిరి వెంకటి, టీఆర్‌ఎస్ నాయకులు తిర్మల్‌రెడ్డి, బీజేపీ నాయకులు ఇట్టం సిద్ధిరాములు, మోతె కృష్ణాగౌడ్, రాజు, సుధాకర్, హరిధర్, టీడీపి నాయకులు చీల ప్రభాకర్, ఉస్మాన్, నజిరోద్దిన్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. సీపీఎం, సీపీఐ నాయకులు చంద్రశేఖర్, భూమ న్న, రాజలింగం బస్టాండ్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు.
విద్యా సంస్థలు మూసివేత
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థలను మూసివేశారు. పట్టణంలో భైక్ ర్యాలీలు నిర్వహించారు. పీడీఎస్‌యూ నాయకులు ఆజాద్, రాజు, క్రాం తి, టీజీవీపీ నాయకులు నవీన్, ప్రకాష్‌నాయక్, అర్జున్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు భానుప్రసాద్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల విధుల బహిష్కరణ
బంద్‌కు మద్దతుగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. అనంతరం ఆర్‌డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కామారెడ్డి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఎప్పటి నుంచో కొనసాగుతోందని, ఇక్కడ జిల్లా ఏర్పాటుకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. కార ్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. దామోదర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు అతిమాముల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి గజ్జెల భిక్షపతి, న్యాయవాదులు చింతల గోపి, సురేందర్‌రెడ్డి జగన్నాథం, వెంకట్రాంరెడ్డి, సంజీవరావు, రవీంద్రభూపాల్, చంద్రశేఖర్, బి.నారాయణ, రత్నాకర్‌రావ్, రాజబాబాగౌడ్, క్యాతం సిద్దరాములు, మాయ సురేశ్, బాలకృష్ణ, నాగభూషణం, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.