ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు అన్నారు.
ఖమ్మం: ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు అన్నారు. జిల్లా శిశుసంక్షేమశాఖ ఉద్యోగుల సంఘం సమావేశం ఆదివారం ఖమ్మంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జిల్లా ఉద్యోగులు స్పందించిన తీరు మరువలేమన్నారు. ఆరు దశాబ్దాలుగా సాగిన తెలంగాణ ఉద్యమం విజయం సాధించిందని, ఇప్పుడు ఉద్యోగుల హక్కులను కూడా సాధించుకోవాలని అన్నారు. బంగారు తెలంగాణ రూపొందాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరేలా ఉద్యోగులు ప్రయత్నించాలని కోరారు. ఉద్యోగులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించవద్దని అన్నారు. కార్యక్రమంలో స్త్రీ సంక్షేమశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయరామ్‌నాయక్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కత్తుల రవి, అచ్యుత్‌రామ్, నాయకులు రామయ్య, వల్లోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.